ఫలితాలు 1 నుండి 2 వరకు 2 లో

అంశం: వేమన పద్యాలు

  1. #1
    నిర్వాహకుడు
    చేరిన రోజు
    Jan 2013
    ప్రదేశం
    Vijayawada, India
    పోస్టులు
    1

    Cool వేమన పద్యాలు

    ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు
    చూడ చూడ రుచులు జాడ వేరు
    పురుషులందు పుణ్య పురుషులు వేరయా
    విశ్వదాభిరామ వినురవేమ.
    [hr]
    మేడిపండు చూడు మేలిమై యుండును
    పొట్ట విప్పి చూడు బురుగులుండు
    పిరికివాని మదిన బింకమీలాగురా
    విశ్వదాభిరామ వినురవేమ.
    [hr]
    గంగి గోవు పాలు గరిటడైనను చాలు
    కడివెడైననేమి ఖరము పాలు
    భక్తీ కలుగు కూడు పట్టెడైనను చాలు
    విశ్వదాభిరామ వినురవేమ.
    [hr]
    అనగ ననగ రాగ మతి యిల్లుచునుండు
    దినగం దినగా వేము తియ్యనుండు
    సాధనమున పనులు సమకూరు ధర లోన
    విశ్వదాభిరామ వినురవేమ.
    [hr]
    అనువుగాని చోట నధికుల మనరాదు
    కొంచమయిన నదియ గొదువగాదు
    కొండ యుద్దమందు గొంచమై యుండర
    విశ్వదాభిరామ వినురవేమ.

  2. #2
    చిన్నప్పుడు చదువుకున్నా