ఫలితాలు 1 నుండి 2 వరకు 2 లో

అంశం: సప్తపది

  1. #1

    సప్తపది

    [align=center]

    [size=medium]పెళ్లి అనే అమూల్యమైన బంధంతో ముడిపడే వరుడు, వధువు చేత ఏడు అడుగులు వేయిస్తారు. ఒక్కొక్క అడుగు ఒక వాగ్దానం.అవేమిటో చూడండి...
    [/align]

    1. మొదటి అడుగులో వరుడు వధువు, వాళ్ళ పరివారాన్ని సంరక్షించి, ఆరోగ్యవంతంగా ఉంచుతాము అని ప్రతిజ్ఞ తీసుకుంటారు.
    2. రెండవ అడుగులో వధువు మరియు వరుడు వాళ్ళ మానసిక, శారీరిక మరియు ఆధ్యాత్మిక శక్తి ని అభివృద్ధి చేసుకొని చక్కటి జీవితాన్ని సాగిస్తాం అని వాగ్దానం చేస్తారు.
    3. మూడవ అడుగు లో దంపతులు సక్రమమైన మార్గం ద్వారా జీవనాధారం పొందుతామని వాగ్దానం చేస్తారు.
    4. నాలుగవ అడుగులో దంపతులు ఇరువురు జ్ఞానం మరియు సంతోషాన్ని తమ విశ్వాసము, అవగాహన మరియు ప్రేమానురాగాల ద్వారా పెంపొందించుకుంటా ని ప్రతిజ్ఞ చేస్తారు.
    5. ఐదవ అడుగులో వారు తమ వంస పరంపరను సంతానము ద్వారా పరిరక్షిస్తాము అని వాగ్దానం చేస్తారు. ఇందుకు, వారికి ఆరోగ్యమైన మరియు బలమైన సంతానమునోసంగమని దేవుని ప్రార్దిస్తారు.
    6. ఆరవ అడుగులో ఇరువురు మానసిక, శారీరిక నిగ్రహం, మరియు సుదీర్ఘ వైవాహిక జీవితం కోసం దేవుని ప్రార్ధిస్తారు.
    7. ఏడవ అడుగులో ఒకరికొకరు నమ్మకముగా, నీతిగా నిజాయితిగా జీవితాంతం కలిసి తోడూ నీడగా వుంటామని వాగ్దానం చేస్తారు. [/size]

  2. #2

    RE: సప్తపది

    ధన్యవాదములు! మంచి విషయము తెలియజేసినందుకు