తుషారపు జల్లులు కావవి మంచి ముత్యపు చినుకులు
మంచుదిబ్బలు కావవి మలచని పరుపు దొంతరలు

పిల్లగాలిపిలుపుల కావవి గండుకోయిల పలుకులు
నీలిమబ్బువిరుపుల కావవి నింగిన మెరిసిన తారకలు

పక్షుల కిలకిలరావములు కావవి పసిపాప నవ్వుల కేరింతలు
పచ్చని పసిరికలు కావవి తడిసిన పసిడివన్నెల కాంతులు

మదినూహించినవి కావివి మదినిండిన దృశ్యమాలికలు
మధురోహలతో లిఖించిన అదృశ్య వర్నవీచికలు.

-మంజు శ్రీ