1. పెరుగు లో కొబ్బరి ముక్క వేస్తె తొందరగా పాడవకుండా వుంటుంది.
- Keeping a coconut piece in curd helps in keeping the curd fresh for more time.
2. పప్పు తొందరగా ఉడకాలంటే దాంట్లో కొంచం డాల్డా కాని నూనె కాని వెయ్యాలి.
- For daal to be cooked faster add a littlebit of daalda or oil to it while cooking.
3. పాలు కాచేటప్పుడు పొంగకుండా ఉండాలంటే అంచుకు నూనె రాయాలి.
- Apply little bit of oil to the edges of vessel boiling milk to prevent milk from spilling out.
4. పాలతో వెండి వస్తువులను కడిగితే వాటి గార పోతుంది.
- Washing silver parts with milk removes stains.
5. పట్టు చీరలు వుతికేటప్పుడు బకెట్ లో కొంచం నిమ్మరసం వేస్తె రంగు పోవు.
- Adding a small amount of lime juice to the bucket of water while washing the silk sarees will keep the colours intact.
6. వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే ఒక స్పూన్ పాలు వెయ్యాలి.
- Adding a teaspoon of milk to pieces of brinjal will not let them turn black.
7. గుడ్లు వుడికేటప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేస్తె పెంకులు తొందరగా ఊడిపోతాయి.
- Adding a teaspoon of salt while boiling eggs will make it easier to shell them out
8. పసుపు నీటితో వంటిల్లు కడగటం వాళ్ళ ఈగలు రావు.
- Cleaning the Kitchen with turmeric water will keep the houseflies away.
9. బిస్కట్ ప్యాకెట్ బియ్యం డబ్బాలో వుంచడం వాళ్ళ మెత్త బడవు.
- Storing the biscuit packet in rice container will not allow them to soften.
10. పకోడీలు వేసేటప్పుడు పిండిలో కొంచం సోడా కలిపితే లావుగా అవుతాయి
- Adding a bit of soda salt to the dough will make the pakodas soft and spongy.
11. ఇంగువ నిల్వ చేసే డబ్బాలో పచ్చిమిరపకాయ వేస్తె తాజాగా వుంటుంది.
- Place a small ginger piece int he hing powder container to keep it fresh.
12. క్యాబేజీ వుడికించేటప్పుడు వాసన రాకుండా ఉండాలంటే చిన్న అల్లం ముక్క వెయ్యాలి .
- To avoid unpleasant smell while boiling cabbage leaves, add a small piece of ginger.
13. బంగాళదుంప చిప్స్ కరకరలాడాలంటే, వేయిన్చేముందు వాటిని ఉప్పు నీటిలో నానబెట్టాలి.
-If you want to make crispy potatoes or banana chips, soak them in saltwater before frying them.
14. బంగాళాదుంపలు ఉడికించేటప్పుడు నీటిలో కొద్దిగా నిమ్మ రసం లేదా వెనిగర్ ఒక టీస్పూన్ జోడించండి. దీనివల్ల బంగాలదుంపలు నల్లబడవు. బంగాళాదుంప సలాడ్ చేసేటప్పుడు నీటి లో కొద్దిగా వెనిగర్ జోడించండి. వెనిగర్ ఓక పలుచని పోరగా ఏర్పడి వాటి ఆకారాన్ని కోల్పోకుండా చేస్తుంది.
-Add a little lemon juice or a teaspoon of vinegar to the water when boiling potatoes to prevent them from discoloring.When cooking potatoes for a potato salad, add a little vinegar to the water when boiling the potatoes. The vinegar causes the potatoes to form a thin crust, which helps them hold their shape.