-
అహింసా పరమో ధర్మః
ఒకచోట ఓ పెద్దసభ జరుగుతోంది. ఒక వక్త అదే పనిగా '#అహింసో_పరమో_ధర్మః' అని ఊదర కొట్టేస్తున్నాడు.
వింటున్న నాలాంటోడికి విసుగు పుట్టింది.
కూర్చున్న అతను పైకి లేచాడు.
పక్కనున్న వాళ్ళు 'సమావేశం అయ్యాక భోజనాలు ఉంటాయి. కూర్చోండి' అన్నారు.
"నేను వడ్డించడాని కే వెళ్తున్నాను" అంటూ వేదిక మీదకు వెళ్ళాడు.
వేదిక మీద ఉన్నవాళ్ళు_'ఏమిటి?' న్నట్లు చూసారు.
ఆ పెద్దమనిషి ఇందాకటినుండి 'అహింసో పరమో ధర్మః' అని బోధిస్తున్న వక్త దగ్గరకు వెళ్ళి..వాడి చెంప ఛెళ్ళుమనిపించాడు.
ఆ వక్త బిత్తరపోయాడు.
వేదిక మీద ఉన్నవాళ్ళు ఉలిక్కిపడి ఆ పెద్దమనిషిని పట్టుకున్నారు.
అప్పుడు ఆ పెద్దమనిషి ఇలా అన్నాడు_
"ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమని కదా!ఇందాకటి నుండి మీరు చెబుతున్నదీ? మరి మీరే రెండో చెంప చూపించరేమిటి?"అని అడిగాడు.
బూరెలా వాచిపోయిన చెంపను తడుముకుంటున్న ఆ వక్త బిత్తరపోయి "ఉపన్యాసం ఇమ్మంటే వచ్చాను" అన్నాడు.
"మరి ఆ తరువాతి పాదం చెప్పరేమండీ?"అని అడిగాడు ఆ పెద్దమనిషి.
"అదీ....అదీ...."
"అది నేను చెప్పనా?" అని అడిగాడు ఆ పెద్ద మనిషి.
"ఒద్దొద్దు.నేనే చెబుతాను" అంటూ "#ధర్మ_హింసా_తదైవచ " అని చెప్పాడు, రెండో చెంపకు చెయ్యడ్డం పెట్టుకుంటూ.
"ఈ ముక్క నేకొట్టకముందు చెప్పాలి" అంటూ అందరిని విదిలించుకుని వేదిక దిగాడు..ఆ పెద్దమనిషి.
అంచేత నే చెప్పొచ్చేదమిటంట చెప్పే మంచి ముక్కల్ని,ముక్కలు ముక్కలుగా కాకుండా సంపూర్ణంగా చెప్పాలన్నమాట.
'అహింస ఎంత ముఖ్యమో, అధర్మం జరుగుతున్నప్పుడు హింస కూడా అంతే ముఖ్యం' అన్నమాట.
జాతి నిర్వీర్యం అయ్యే కబుర్లు మాత్రమే చెప్పకండి.
జాతి నీ మేల్కొలిపే ప్రసంగాలు ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేయండి...
మహాభారతంలోని ఈ శ్లోకాన్ని హిందువులకు సగం మాత్రమే అలవాటు చేసారు మన పూర్వీకులు .
"అహింసా పరమో ధర్మం." పూర్తి శ్లోకం ఇలా వుంటుంది.
"అహింసా పరమో ధర్మః
ధర్మ హింసా తదైవచ. "
అర్థం:: అహింస మానవుని యొక్క పరమ ధర్మము మరియు ధర్మ రక్షణ కోసం చేయు హింస అంతకంటే శ్రేష్ఠమైనది.
అర్థమయ్యిందా ఓ హైందవుడా. ఇక కార్యోన్ముఖడవు అవ్వు
Note:- ఇది బుద్ధి లేని బుద్ధుడు చెప్పింది కాదు అంతకు పూర్వమే భారతంలో చెప్పింది..OK
మన పిల్లలకి మన ధర్మాన్ని బోధించుదాం ���������������� �
������శ్రీ మాత్రే నమః ������ జై గురుదత్త ������
శ్రీ గురుదత్త జ్యోతిష్యాలయం
దమ్మాయిగూడ.
లోకాః సమస్తాః
సుఖినోభవంతు
*సర్వే జనాః సుఖినోభవంతు