-
అష్టదిక్పాలకులు ఎవరు?
నాలుగు ప్రధాన దిక్కులతో పాటు. నాలుగు దిక్కుల మూలలకు కాపలాగా ఉండే వారినే అష్టదిక్పాలకులు అంటారు.
వీరిలో తూర్పు దిక్కుకు ఇంద్రుడు, దక్షిణ దిక్కుకు యముడు, పడమర దిక్కుకు వరుణుడు, ఉత్తర దిక్కుకు కుబేరుడు అధిపతిగా ఉంటారు.
వీరితో పాటు ఆగ్నేయానికి అధిపతిగా అగ్నిదేవుడు, నైరుతి దిక్కుకు అధిపతిగా నిర్భతి, వాయువ్య దిక్కుకు వాయుదేవుడు, ఈశాన్య దిక్కుకు ఈశానుడు అధిపతులుగా ఉంటారు.
వీరినే అష్టదిక్పాలకులు అంటారు.
వీరికి భార్యలు : ఇంద్రుని భార్య శనీదేవి, అగ్నిదేవుని భార్య స్వాహాదేవి, యముని భార్య శ్యామలాదేవి, నిర్భతి భార్య దీర్ఘాదేవి, వరుణుని సతీమణి కాళికాదేవి, వాయుదేవుని భార్య అంజనాదేవి, కుబేరుని భార్య చిత్రరేఖాదేవి, ఈశానుని భార్య పార్వతీదేవి.