-
వివిధ రకమైన కారాలు
మన తెలుగువాళ్ళకు కారాలంటే ఎంతో యిష్టం.ఈ వివిధ రకాలైన కారాలను చూడండి.
మొదలు పెట్టె కారం -- శ్రీకారం
గౌరవించే కారం ----సంస్కారం
ప్రేమ లో కారం --- మమకారం
పలకరించేకారం ----నమస్కారం
పదవి తో వచ్చే కారం ---అధికారం,
అది లేకుండా చేసే కారం------ అనధికారం
వేళాకోళం లో కారం ---- వెటకారం
భయం తో చేసే కారం ---- హాహాకారం
బహుమతి లో కారం --- పురస్కారం
ఎదిరించే కారం --- ధిక్కారం
వద్దని తిప్పికొట్టే కారం-----తిరస్కారం
లెక్కల్లో కారం --- గుణకారం
గుణింతం లో కారం -- నుడికారం
గర్వం తో వచ్చే కారం ---- అహంకారం
సమస్యలకు కారం ----- పరిష్కారం
ప్రయోగశాల లో కారం------- ఆవిష్కారం
సంధులలో కారం --- 'ఆ'కారం
సాయం లో కారం --- సహకారం
స్రీలకు నచ్చే కారం--- అలంకారం
మేలు చేసే కారం ----ఉపకారం
కీడు చేసే కారం -- అపకారం
శివునికి నచ్చే కారం ---- ఓం కారం
విష్ణువు లో కారం ----శాంతాకారం
ఏనుగులు చేసేది --- ఘీంకారం
మదం తో చేసే కారం --- హూంకారం
పైత్యం తో వచ్చే కారం --వికారం
రూపం తో వచ్చే కారం --ఆకారం
ఇంటి చుట్టూ కట్టే కారం -- ప్రాకారం
ఒప్పుకునే కారం --- అంగీకారం
చీదరించుకునే కారం ---చీత్కారం
పగ తీర్చుకునే కారం---- ప్రతీకారం
వ్యాకరణం లో వచ్చే కారాలు 'ఆ'కారం', 'ఇ' కారం, 'ఉ' కారం.
మన తెలుగులో ఇన్ని కారాలు వున్నా విషయం ఇప్పుడే తెలిసింది