-
దీపావళి నాడు ప్రమిదలు ఎందుకు వాడాలి?
మార్కెట్లో దీపావళికి ప్రత్యేకమైన మైనపు వత్తులను అమ్ముతున్నారు. అవి దీపాలుగా వెలిగించకూడదు. సంప్రదాయ దీపాలు ప్రకృతిలో ఉన్నసానుకూల శక్తిని (positive energy), దైవ శక్తులను ఆకర్షిస్తే, కువ్వొత్తులు ప్రతికూల శక్తిని (negative energy), దుష్టశక్తులను ఆకర్షిస్తుంది. కావాలంటే మీరు ఒక చీకటి గదిలో క్యాండిల్ వెలిగించి కాసేపు కూర్చొండి. మరొకసారి అదే గదిలో దీపారాధన చేసి కూర్చోండి. మీరే గమనిస్తారు ఈ రెండిటి మధ్య తేడా. దీపం శుభాలను తీసుకువస్తుంది. కువ్వొత్తి శోకానికి కారణమవుతుంది.
నువ్వుల నూనె దీపం వాతావరణంలో ఉన్న క్రిములను నాశనం చేస్తుంది. ఈ దీపపు కాంతి కళ్ళకు కూడా మంచిది. దృష్టిని (eye-sight) మెరుగుపరుస్తుంది. ఇక దీపావళి నాడే ఎందుకు నువ్వుల నూనె దీపం పెట్టాలి అంటే దీపవళి చలికాలంలో వస్తుంది. సూర్యుడు భూమికి దూరంగా జరుగుతాడు. చల్లటి వాతావరణంలో అనేక క్రిములు వ్యాపిస్తాయి. అలాగే శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు వస్తాయి. ప్రమిదలో నూనె అయిపోయాక వత్తి కూడా కాలిపోతుంది. ఆ వత్తి కాలడం వల్ల వచ్చిన వాసన పీల్చడం ద్వారా ఊపిరితిత్తులు (lungs), గుండెకు(heart) సంబంధించిన రోగాలు రాకుండా నిరోధింపబడతాయి. అలాగే ఈ దీపం కొంత వేడిని కూడా పుట్టిస్తుంది. ఏదైన ఒక వస్తువు కాలినప్పుడు carbon విడుదలవుతుంది. అది గాలిలో ఉన్న తేమను పీల్చేస్తుంది. మట్టి ప్రమిద మన శరీరానికి సంకేతం. అందులో నువ్వులనూనె మన పూర్వజన్మ వాసనలకు (గత జన్మ నుండి మనకు ప్రాప్తించిన పాపపుణ్యాలు, అలవాట్లు, సంస్కారాలు) ప్రతీక. అందులో వేసే వత్తి అహంకారానికి గుర్తు. దీపం జ్ఞానానికి సంకేతం. జ్ఞానమనే దీపం మన పూర్వజన్మవాసనలను, అహంకారాన్ని, చెడు అలవాట్లను కాల్చేసి, పరమాత్ముడిని చేరుస్తుంది అన్నది దీపం వెలిగించడం వెనుక ఉన్న అర్ధం. అందువల్ల దీపావళికి మట్టి ప్రమిదలనే కొనండి.
ప్రమిదల గురించి మరిన్ని వివరాలకు ఈ త్రెడ్ ను కూడా సందర్శించండి : ప్రమిదెల రకాలు
చివరగా మార్పులు చేసినవారు Telugabbayi; 23-10-2014 02:28 PM.