ఈ సామెత వినే ఉంటారు. దీనికి అర్ధం తెలుసా మీకు?
ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు - మంగలం అంటే ఏమిటో పట్టణాలలో ఉండే వారికి తెలియకపోవచ్చు, కానీ గ్రామాలలో ఉండేవారికి తెలుసు. సాధారణంగా ఒక పాత కుండను (ఓటికుండ, కొంచం పగులిచ్చిన కుండ) తీసుకుని దానికి ప్రక్కన చేయి పట్టేంత రంధ్రం చేస్తారు.ఈ రంధ్రంతో కుండ ఇంకా బలహీనమౌతుంది. దీనినే మంగలం అంటారు. మంగలంలో ఎండు మిరపకాయలు, పేలాలు లాంటివి వేయించుతారు. ఇలా మంగలం దాదాపుగా అత్యంత బలహీనమైన వస్తువు అవుతుంది. అత్యంత శక్తివంతమైన ఉరుము (పిడుగు) మంగలం మీద పడితే, నష్టం ఏమి లేదు. కేవలం పోయేది ఒటి కుండే. బలవంతుడు బలహీనుడి మీద తన ప్రతాపాన్ని చూపించే ప్రయత్నం చేసినప్పుడు ఈ సామెత వాడతారు.

అచ్చంగా తెలుగు నుండి