ఫలితాలు 1 నుండి 1 వరకు 1 లో

అంశం: పాపం, వేపచెట్టు !

  1. #1

    పాపం, వేపచెట్టు !

    ఇపుడు ఏ ఊరిలో చూసినా వేప చెట్ల సంఖ్య చాలా గణనీయంగా తగ్గిపోతోంది. కలప కోసం వేపచెట్ల ను విపరీతంగా నరికేస్తున్నారు. వేపవృక్షజాతిని ధ్వంసం చేస్తున్నారు. ముఖ్యంగా ఊరికి ఎంతో నీడను , చల్లని గాలిని పంచే ఈ వేప నేస్తం ఇక కనుమరుగవకతప్పదా? ముందుగా ఏ ఊరిలో అడుగు పెట్టినా, స్వాగతం చెప్పేవి ఈ చెట్లే. దాదాపు ప్రతీ పది ఇండ్లలో, ఏడు ఎనిమిది చెట్లు ఇవే కనిపించేవి . ఈ చెట్లకు ఉయ్యాలలు కట్టుకొని, ఊరిలోని పిల్లలంతా తమ చల్లని సాయంత్రాలను ఈ వేపచెట్ల కిందే గడిపేవారు. ఈ చెట్లపైన కోతి కొమ్మచ్చి లాంటి ఆటలు ఆడేవారు.
    అంతేకాదు, ఔషధపరంగా కూడా వేపచెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దీనిలోని అన్ని భాగాలు , అనగా ఆకులు, పండ్లు నుండి బెరడు వరకు అన్నీ ఉపయోగాలే. నా చిన్నప్పుడయితే ' వేపకల్లు ' అని అమ్మేవారు .
    అన్నింటి కంటే ముఖ్యంగా, అందరూ; ముఖ్యంగా హిందువులు ఈ చెట్టును దేవతగా పూజిస్తారు. అటువంటి వేపచెట్టు జాతి నేడు అంతరించిపోయే దశలో ఉంది. దీనిని కొందరు సోమరిపోతులు, ఏ పని చేతకాక చెట్లను నరికి అమ్మి సొమ్ముచేసుకుంటున నారు. ఈ చెట్టుజాతిని అంతరింపజేస్తున్న రు. 'ఒక చెట్టును నరకాలంటే, దానికి బదులుగా మూడు చెట్లను నాటిన తర్వాతే నరకాలి' అనేవిధంగా మన ప్రభుత్వాలు , అధికారులు చర్యలు తీసుకుంటే బాగుండానిపిస్తుం ి.
    ఇలాంటి దుస్థితి ఏ ఒక్క వృక్షజాతికే కాదండి. సమస్త భూమి, గాలి, నీరు, ఇసుక, రాయి, కొండలు, గుట్టలు, పశువులు, పక్షులు, జంతువులు వంటివెన్నో ఈ లిస్ట్ లో ఉన్నాయి. భూమి మీద ఉన్న ఈ ఒక్క మానవుడే ఈ విధంగా ప్రకృతినంతా నాశనం చేస్తున్నాడు. మరి దీనిని అరికట్టేదెవరు? ఎప్పుడు??
    ఇక ముందు తరాలకు వేపచెట్టు గురించి చెప్పాలంటే, పుస్తకాల్లో బొమ్మలు చూపించి వివరించాల్సిందే.
    అసలు , నాకు దేవుడు కనిపించి ఏదైనా వరం కోరుకోమంటే 'ఈ భూమిపై నున్న మానవులందర్ని ఒక పది సంవత్సరముల వరకు కఠినశిలలుగా మార్చమంటాను'. ఎందుకంటే, ఆ తర్వాతైనా ఈ ప్రకృతి తల్లి మళ్ళీ జీవం పోసుకుంటుంది. పచ్చని చెట్లతో, స్వచ్చమైన నదులతో, చల్లని గాలితో, పశు పక్శ్వాదులతో, సమస్త జీవరాశితో ఈ భూమితల్లి కలకలలాడుతుందని ఆశ. ఈ ఉగాది పర్వదినాన వేపపూత దొరకని గడ్డురోజులు రావద్దు దేవుడా అని కోరుకుంటూ.... మీ కామెట్.
    చివరగా మార్పులు చేసినవారు Telugabbayi; 31-07-2016 04:28 PM.