-
దేవాలయాలు ఎందుకు?
“దేవుడుఅన్నిటిలో మరియు అన్ని చోట్లా వున్నాడు కదా, మరిఅంత ఖర్చు పెట్టి దేవాలయాలు ఎందుకు కట్టడం?”
ఈ మధ్యతెలివైన కుర్రకారు చాల మందికి ఈ సందేహం వస్తుంది.వారిని ఉద్దేశించి ఈ సారంశం రాయడమైనది.
అవును, దేవుడు ప్రతిదాంట్లో మరియు ప్రతిచోటా వున్నాడు. మనం మనఃపూర్వకముగా చుట్టూ చూసినప్పుడు దేవుడు కనిపించాలి లేదా మనము దేవుని యొక్క అనుభూతి పొందాలి. మనలోఎంత మందికి ఇలాంటి అనుభూతి కలుగుతుంది? ఆచరణాత్మకంగా మాట్లాడితే, దేవుని అనుభూతి, చాలాసూక్ష్మ స్థాయిలో వుంటుంది. ఆ అనుభూతి కేవలం ధ్యానoలో వున్నప్పుడు మాత్రమె పొందగలము. దేవాలయం సందర్శించినప్పుడ అక్కడ ప్రతిష్టించబడిన పవిత్రమైన విగ్రహం ద్వారా దివ్యత్వం మరియు దేవుని యొక్క అనుభూతి మనకి కలుగుతుంది.
తీర్ధం సేవించిన తర్వాత చేతిని తలకు రాసుకోవచ్చా.....!!
తీర్ధం తీసుకోవటానికి చేతిని గోకర్ణభంగిమలో ఉంచి తీసుకుంటాము. ఆ పై అనాలోచితంగా మనం ఆ చేతిని తల పై రాసుకుంటాము . అలా చేయ్యడం తగదు.
తీర్ధం పంచామృతంతో చేస్తారు. అందులో తేనె, పంచాదార వంటివి జుట్టుకి మంచిదికాదు . అలాగే తులసీ తీర్ధం తీసుకొన్నా తలపై రాసుకోకూడదు.
తీర్ధం తీసుకోవటం వల్ల చేయి ఎంగిలవుతుంది.
ఎంగిలి చేతిని తలపై రాసుకోకూడదు.
ఏ తీర్ధం తీసుకున్న చేతిని సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి . వైష్ణవ సంప్రదాయం లో గంగా జలంతో అభిశేకం చేసిన తీర్థాన్ని మాత్రమే తల వెనుక రాసుకోవలని ఉంది .
చివరగా మార్పులు చేసినవారు Telugabbayi; 24-02-2016 11:28 PM.