-
ప్రమిదలలో రకములు - వాటి ఫలితములు
రాతి యుగం నుండి రాతిలో వెలిగించే దీపాల నుండి లోహంతో వెలిగించు దీపాల వరకు, దీపాల అకృతులకును, వాటిని తయ్యారు చెయ్యటానికి వాడే వస్తువునకు కుడా ఎంతో ప్రాముఖ్యత మరియు చరిత్ర ఉన్నది.
రాతి యుగంలో రాతినే దీపపు సెమ్మెలుగా మలచి దీపారాధన చేసేవారు.అలాగే రకరకాల దేవాలయాలలో కూడ దీపారాధనకు ఉపయోగించేవారు. ఆ తరువాత మట్టి ప్రమిదలు వాడుకలోకి వచ్చాయి. మనుషులలో ఆర్ధికంగా, సామాజికంగా వచ్చిన మార్పుల బట్టి దీపాకృతుల్లోను వాటి పరిమాణంలోను మరియు కళత్మకతలోను మార్పులు వచ్సాయి.
ఉదాహరణకు ఆర్ధికంగా ఉన్నవారు స్వర్ణదీపాలు,నవరత నాలు పొదిగిన దీపాల సిమ్మెలు వాడేవారని మన ప్రాచీన ఇతిహాసాలలోను కావ్యాలలో ప్రస్తావనలు ఉన్నాయి. అలాగే, పూర్వము శిల్పులూ, చిత్రకారులు దీప ప్రతిమలను మలచుటలో తమ తమ ప్రతిభలను, పనితనాన్ని ప్రదర్శించేవారు. వీటికి నిదర్సనం ఇప్పుడు మన ప్రాచీన దేవాలయాలలో కనిపిస్తుంది
చివరగా మార్పులు చేసినవారు Telugabbayi; 12-11-2013 03:27 PM.