-
మనం దేవాలయం ఎందుకు సందర్శించాలి?
వేర్వేరు పరిమాణంలొ, ఆకారంలొ మరియు ప్రాంతాలలో భారతదేశం అంతటా దేవాలయాలు వేలకొలది వున్నాయి. కానీ, అన్ని వేద మార్గం అనుసరించి నిర్మించారు అని చెప్పలేము. సాధారణంగా, ఆలయం అనేది భూమి యొక్క అయస్కాంత తరంగం దట్టంగా వున్నచోట నిర్మిస్తారు. ఇది ఒక పట్టణం / గ్రామం లేదా నగరం సరిహద్దులలో, లేదా నివాసస్థలం స్థలం మధ్యలో, లేదా ఒక కొండ మీద ఉండటం జరుగుతుంది. మనము ఆలయాన్ని సందర్శించే సారాన్ని ఇక్కడ మాట్లాడుకుందాం.
ఈ దేవాలయాల సానుకూల శక్తి ఉత్తర / దక్షిణ ధ్రువం యొక్క విద్యుత్థ్ర తరంగం నుండి వెలువడే అయస్కాంత శక్తి విస్తారంగా అందుబాటులో వుండే ప్రదేశం వద్ద వ్యూహాత్మకంగా ఉంటాయి. ప్రధాన విగ్రహం "గర్భగృహం" లేదా "మూలస్తంభం" అని పిలవబడే ఆలయ మధ్య భాగంలో ఉంచుతారు. వాస్తవానికి, విగ్రహం స్తాపించబడ్డ తరువాత మాత్రమె ఆలయ నిర్మాణం కావించబడుతుంది. ఈ మూలస్తంభం అనేది భూమి యొక్క అయస్కాంత తరంగాలు గరిష్టంగా ఉన్న చోట వుంటుంది. ప్రధాన విగ్రహం కింద వేద మంత్రాలు చెక్కివున్న కొన్ని రాగి రేకులు ఉంచబడుతాయి. ఇవి వారు (మతాచార్యులు) శ్లోకాలు మర్చిపోతే చూసి చదవటానికి వాడే ఫ్లాష్ కార్డులు కావు. ఈ రాగి పళ్ళెములు భూమి నుండి వెలువడే అయస్కాంత తరంగాలను గ్రహించి పరిసరాలకు ప్రసరణ చేస్తాయి. అందువలన తరచుగా ఆలయాన్ని సందర్శించినప్పుడ మరియు ప్రధాన విగ్రహం చుట్టూ సవ్యదిశలో ప్రదక్షిణ చేసినప్పుడు, మన శరీరం ప్రకాశించిన అయస్కాంత తరంగాలు గ్రహిస్తుంది. ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుంది. తరచుగా ఆలయ సందర్శన అతనికి/ఆమెకు ఈ సానుకూల శక్తి మరింత ఎక్కువ గ్రహించడం జరుగుతుంది. శాస్త్రీయంగా, ఇది ఇది ఒక ఆరోగ్యకరమైన జీవితం జీవించేందుకు దోహద పడుతుంది.
గర్భగుడి మూడు వైపులా మూసివేయబడి వుంటుంది. అందువలన ఈ శక్తుల ప్రభావం పెరుగుతుంది. గర్భగుడి లోపల వెలిగించే దీపం, అర్చకులకు ఉష్ణశక్తి మరియు కాంతి ప్రసాదిస్తుంది. అర్చకులు పూజ చేస్తూ, గంటలు మోగిస్తూ ప్రార్ధనలు పఠించడం ద్వారా భక్తులు మైమరచి పోతారు. సమూహంలో చేసినప్పుడు, ప్రజలు కాసేపు వ్యక్తిగత సమస్యలు మర్చిపోయి ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. పుష్పాలు నుండి సువాసన కర్పూరం దహనం రసాయన శక్తి ని పెంపొందిచుతాయి. ఈ శక్తుల ప్రభావం, విగ్రహం నుండి సానుకూల శక్తి, రాగి రేకులు మరియు మూలస్తంభం నుండి వెలువడే శక్తులకు అనుబంధంగా ఉంతుంది.తీర్థం అనేంది కేవలం, విగ్రహం నుండి దుమ్మును కడగడం కోసంమే కాదు, ఇది ఏలకులు, కర్పూరం, కుంకుమ, తులసి, లవంగము, మొదలైనవి కలిగి వుందడి విగ్రహం కడిగినప్పుడు, అయస్కాంత వికిరణాల వలన దీని ఔషధ విలువలు పెరుగుతాయి. ఈ పవిత్ర జలం మూడు చెంచాలు భక్తులకు ఇస్తారు. ఈ ననీరు ప్రధానంగా అయస్కాంత చికిత్స యొక్క మూలం. లవంగం సారాంశం దంత క్షయం నుండి, కుంకుమ మరియు తులసి జలుబు మరియు దగ్గు నుండి రక్షిస్తాయి, ఏలకులు మరియు పచ్చ కర్పూరం, నోటి దుర్వాసన పోగొట్టేవిగా వ్యవహరిస్తాయి. ఈ తీర్థం మంచి రక్త పరిసుద్ధి అని నిరూపించబడింది. అందువల్ల ఇది భక్తులకు ప్రసాదంగా ఇవ్వబడుతుంది. ఈ విధంగా, క్రమం తప్పకుండా దేవాలయాలు సందర్శించడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని పాడడాలు గుడికి వెళ్ళమని సూచిస్తుంటారు. కాని అనేక తీవ్రమైన వ్యాధులు దేవతల ద్వారా దేవాలయాలలో నయం కాలేవు. ప్రజలు దేవాలయానికి వెళ్లినప్పుడు దీపారాధన చేసిన పిమ్మట తలుపులు తెరవడం వలన, సానుకూల శక్తి అక్కడ ఉన్న భక్తులకు లభ్యమవుతుంది. సమూహం పై చల్లబడే నీరు ఈ శక్తిని అందరికి అందేలా చూస్తుంది. పురుషులు ఆలయం సందర్శనల సమయంలో చొక్కాలను ధరించకూడదని మరియు స్త్రీలు మరింత ఆభరణాలు ధరించమని అభ్యర్థించబదేది ఎందుకు అనేది మనకి గోచరిస్తుంది. కొత్తగా కొనుగోలు చేసిన నగలు లేదా కొత్త బట్టలు విగ్రహం పాదాల వద్ద వుంచి దేవుని దీవెనలతో వాటిని ధరించడం ఒక పద్ధతి. ఈ పద్ధతి, ఈ వ్యాసం చదివిన తరువాత న్యాయబద్దతను సంతరించుకుంది. పుస్తకాలు లేదా పెన్నులు లేదా ఆటోమొబైల్స్ వంటి, ఏ కొత్త కథనం ఉపయోగించే ముందు దైవ దీవెనలు కోరటం ఇందువాలనే కావచు.
మనం రోజువారి పని అయిన తరువాత కోల్పోఇన శక్తి ఒక ఆలయం సందర్శన ద్వారా కొద్దిగా పొందగలము. ఆలయం మరియు ముఖ్యంగా ప్రధాన విగ్రహం ఉంచబడిన చోట చుట్టూ ప్రదక్షిణ చేసినచో అనుకూల శక్తి వలన శరీరం మరియు మనస్సు ఉత్తేజాన్ని పొందుతాయి. మీకు ఇది తెలుసా, ప్రతి వైష్ణవడు (విష్ణు భక్తులు), రెండుసార్లు ప్రతి రోజు ఒక విష్ణు దేవాలయం తప్పక సందర్శించాలని పెద్దల ద్వారా సూచించబడింది. ఈ విధానాలు ఎవరో ఒక వ్యక్తి లేదా తన అనుచరులు లేదా ఎవరో కలలోని దేవుని పదాలు ద్వారా రూపొందించిన నియమాలు కాదు. వాస్తవానికి అన్ని ఆచారాలు, పద్ధతులు, బాగా పరిశోధన చేయబడి అధ్యయనం చేయబడినవి మరియు ఒక మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ప్రకృతి మార్గాలుగ శాస్త్రీయంగా నిరూపింపబడ్డాయి.
పైన చెప్పిన విధానాలు శాస్త్రీయ మరియు పరిశోధన పరముగా కాకుండా "పెద్దల సూచనలు" లేదా "బామ్మ మాట" అని గౌరవ సూచకంగా చెప్పబడినవి. అందుకే సగటు మెదడుల్లో ఒత్తిడిని నివారించేందుకు పెద్దల మాట వినటం ఆనవాయితీ గ సూచించడం జరిగింది.
అందుకే మనము కూడా మన పిల్లలకి, ఆలయాలకు వెళ్ళటం వలన కలిగే లాభాలను విసదీకరిస్తే, వారు కూడా లభ్యం పొందగలరు.
మీ తెలుగబ్బాయి.
చివరగా మార్పులు చేసినవారు Telugabbayi; 02-08-2013 09:16 AM.