జాస్తి రామకృష్ణ చౌదరి
ఈర్ష్య
మా ఇంటి ముంగిట్లో కానీ
పెరట్లో కానీ
ఒక్క గులాబీ మొక్క కూడా నాట లేదు నేను
కానీ ఎదురింట్లో పూచిన గులాబీని
చూస్తే మాత్రం నాకు చెడ్డ అసూయ
పాపం!
తను - ఆ గులాబి
తన సోయగంతో, తన సౌరభంతో
మనసుల్ని అలరిస్తూ
కొద్ది రోజులే జీవిస్తుంది
జన్మని సార్ధకం చేసుకుని
తనువు చాలిస్తుంది
నేను కూడా ఏదో రోజు పోతా
కానీ ఇలా క్షణక్షణం
అర్ధం పరమార్ధం లేకుండా
చస్తూ బ్రతకడం ఏమిటో.........
బ్రతుకుతూ చావడం ఏమిటో.....
నాకస్సలు అర్ధం కాదు!
ఎప్పటికి మారుతుందో ఈ జీవితం?
10feb2014