-
సంక్రాంతి 2014
మకర సంక్రమణం లేదా మకర సంక్రాంతి పండుగ హిందువులకు అతి ప్రాముఖ్యమైన పండుగలలో ఒకటి. ఇది సూర్యుడు మకర రాసిలోకి ప్రవేశించే సమయం. పురాతన సంస్కృతీ సంప్రదాయాలు అనుసరించి, సూర్యుని పరివర్తన మకర రాశిలోకి సూర్యాస్తమయం తరువాత జరిగితే, తదుపరి రోజున పండుగ జరుపుకుంటారు.
ఈ 2014 సంవత్సరంలో జనవరి 14 నాడు, సూర్యుడు మకర రాసిలోకి సాయంత్రం 6:20 లకు ప్రవేశిస్తాడు. జ్యోతిష్యశాస్త్ర లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో కొన్ని నిమిషాల వైవిధ్యంతో, తిరుపతిలో సాయంత్రం 5:40 లకు, ఈ సంఘటన జరుగుతుంది. ఈ పరివర్తన యొక్క సమయం సూర్యాస్తమయం తరువాత కనుక, సంక్రాంతి పండుగ జనవరి 15 న జరుపుకోవాలి.
అందుకే గమనించగలరు,
జనవరి 14, 2014 - భోగి
జనవరి 15, 2014 - మకర సంక్రాంతి
జనవరి 16, 2014 - కనుమ పండుగ.
-------------------------------------------