PDA

View Full Version : వేమన పద్యాలు



Tony
03-04-2013, 12:28 PM
ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు
చూడ చూడ రుచులు జాడ వేరు
పురుషులందు పుణ్య పురుషులు వేరయా
విశ్వదాభిరామ వినురవేమ.
[hr]
మేడిపండు చూడు మేలిమై యుండును
పొట్ట విప్పి చూడు బురుగులుండు
పిరికివాని మదిన బింకమీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ.
[hr]
గంగి గోవు పాలు గరిటడైనను చాలు
కడివెడైననేమి ఖరము పాలు
భక్తీ కలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినురవేమ.
[hr]
అనగ ననగ రాగ మతి యిల్లుచునుండు
దినగం దినగా వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధర లోన
విశ్వదాభిరామ వినురవేమ.
[hr]
అనువుగాని చోట నధికుల మనరాదు
కొంచమయిన నదియ గొదువగాదు
కొండ యుద్దమందు గొంచమై యుండర
విశ్వదాభిరామ వినురవేమ.

Telugabbayi
24-11-2013, 01:26 PM
8-> చిన్నప్పుడు చదువుకున్నా