PDA

View Full Version : జనవరి 1 విశిష్టత ఏమిటి?



Telugabbayi
05-01-2014, 09:17 AM
మన తెలుగు కాలమానం ప్రకారం లేదా ప్రకృతి కాలమానం ప్రకారం జనవరి 1 కి విశిష్టత ఏమి లేదు.
జనవరి 1 నాడు పాశ్చాత్య దేశాల "New year" లేదా కొత్త సంవత్సరం ఆ రోజు నుండి మొదలు అవుతంది. కాని ఆ రోజుకి పర్యావరణ పరముగా కాని, గ్రహాల పరముగా కాని ఎటువంటి విశిష్టమైన మార్పులు జరగవు. ఈ రోజు కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో గడపడం మంచిదే కాని, ఈ కాలంలో కేవలం మద్యం సేవించి, ఆ మత్తులో మరుసటి రోజు మధ్యార్నం వరకు పడుకోవడం పరిపాటి అయిపొయింది.

మన తెలుగువారి కొత్త సంవత్సరం కేవలం ఉగాది మాత్రమె. ఉగాది నాడు చెట్లు చిగురిస్తాయి. చంద్రుని కక్షలో మార్పుతో కొత్త సంవత్సరం మొదలవుతుంది. కనుక తెలుగు సంస్కృతీ పాటించేవారందరూ,ఉగాదిని కొత్త సంవత్సరంగా పరిగణించమని మనవి.